వయసు భారమైన వేళ.. వృద్ధుడికి అండగా నిలిచిన పోలీస్ బాస్

వయసు భారమైన వేళ.. వృద్ధుడికి అండగా నిలిచిన పోలీస్ బాస్

IMG-20260211-WA0083ప్రజాస్వామ్య పండుగలో ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్ధుడికి జిల్లా పోలీస్ బాస్ అండగా నిలిచారు. బుధవారం నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్న క్రమంలో పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య మానవీయ కోణాన్ని చాటుకున్నారు. చంద్రశేఖర్ కాలనీలోని పోలింగ్ కేంద్రం వద్ద నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధుడిని చూసిన ఆయన, వెంటనే స్పందించి స్వయంగా వీల్ ఛైర్‌ను నెట్టుకుంటూ వెళ్లి సదరు వృద్ధుడు ఓటు వేయడానికి సహకరించారు. ఉన్నతాధికారి హోదాలో ఉండి కూడా సామాన్యుడి పట్ల ఆయన చూపిన ఈ చొరవ అక్కడున్న ఓటర్లను, సిబ్బందిని విశేషంగా ఆకట్టుకుంది.

Views: 31
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు