కార్మిక సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ

సాలూర తహశీల్దార్ శశి భూషణ్‌కు వినతిపత్రం అందజేత

కార్మిక సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ

జాతీయ సార్వత్రిక సమ్మెలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం సాలూర మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం నుండి తహశీల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ శశి భూషణ్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తోపునూరు చక్రపాణి మాట్లాడుతో.... కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, కనీస వేతనం ₹26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ₹10 వేల వేతనం ఇవ్వాలని, సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. సివిల్ సప్లై హమాలీలకు బస్తా రేటు ₹38 కు పెంచి, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. ఎల్ఐసీలో ప్రైవేట్ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, పాఠశాల స్వీపర్లకు నేరుగా ఖాతాల్లోనే వేతనాలు జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సాలూర మండల అధ్యక్షురాలు రూప, ఉపాధ్యక్షులు ఉమ, రెడ్డి శ్యామ్, విట్టల్, విజయ్ కార్మికులు పాల్గొన్నారు.
Views: 24
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు