ఘనవిజయం.. ప్రజాసేవకే అంకితం

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సునీల్ కుమార్‌లను కలిసిన భీంగల్ విజేతలు

ఘనవిజయం.. ప్రజాసేవకే అంకితం

భీంగల్ మున్సిపల్ రెండో విడత సాధారణ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ తదితరులతో కలిసి నూతన కౌన్సిలర్లు పీసీసీకి పూలమాలలు వేసి కృతజ్ఞతలు తెలిపారు.
సామాన్య కార్యకర్తకు పట్టం.. పాదాభివందనం
మారుమూల రహాత్ నగర్ గ్రామం నుంచి 20 ఏళ్ల క్రితం వచ్చి భీంగల్‌లో స్థిరపడిన సామాన్య కార్యకర్త మలావత్ సంగ్యా నాయక్‌ను గుర్తించి, 11వ వార్డు టికెట్ ఇచ్చి గెలిపించినందుకు ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తనను ఆశీర్వదించిన మహేష్ కుమార్ గౌడ్, సునీల్ కుమార్‌లకు ఆయన నిజామాబాద్‌లో పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలిపారు. సామాన్య కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత గౌరవం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
సామాన్య కార్యకర్తకు పట్టం.. పాదాభివందనం
మారుమూల రహాత్ నగర్ గ్రామం నుంచి 20 ఏళ్ల క్రితం వచ్చి భీంగల్‌లో స్థిరపడిన సామాన్య కార్యకర్త మలావత్ సంగ్యా నాయక్‌ను గుర్తించి, 11వ వార్డు టికెట్ ఇచ్చి గెలిపించినందుకు ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తనను ఆశీర్వదించిన మహేష్ కుమార్ గౌడ్, సునీల్ కుమార్‌లకు ఆయన నిజామాబాద్‌లో పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలిపారు. సామాన్య కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత గౌరవం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: పీసీసీ
విజయం సాధించిన కౌన్సిలర్లను అభినందించిన మహేష్ కుమార్ గౌడ్.. కాంగ్రెస్ పార్టీ విధానాలను నమ్మి పట్టం కట్టిన భీంగల్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఎన్నికల హామీలన్నింటినీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
 
ఈ కార్యక్రమంలో నూతన కౌన్సిలర్లు సంటి లత, ఆరెపల్లి శ్రీజ, పర్శ కుశలత, తోట సతీష్, బోదిరే నాగమణి, అంజుమ్ అలీ, సందీప్, సంగ్యా నాయక్‌లతో పాటు మండల అధ్యక్షుడు బోదిరే స్వామి, పట్టణ అధ్యక్షుడు నర్సయ్య.  ముఖ్య ప్రతినిధులు రహాత్ నగర్ సర్పంచ్ లకావత్ తిరుపతి, ఉప సర్పంచ్ భూక్య సేవలాల్, విడిసి చైర్మన్ బాదావత్ గోపాల్ నాయక్, కొత్త తండా ప్రతినిధులు ధరావత్ శోభన్ నాయక్, బంగి రవి నాయక్, బాదావత్ బాలు నాయక్. మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజు నాయక్, సోషల్ మీడియా వారియర్స్ భూక్య మోహన్ నాయక్, మాజీ ఎంపీటీసీ ఇమ్మడోజి వెంకటరమణ, తాళ్లపల్లి సీనియర్ నాయకులు భూక్య రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

b

Views: 10
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు