ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ దాడులు
By R.Suresh
On
నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని మందర్న శివారులో గల మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాలీ ఆటోలను రెవెన్యూ అధికారులు గురువారం సాలూర శివారులో పట్టుకున్నారు. ఇన్ఛార్జ్ తహశీల్దార్ అనుష తెలిపిన వివరాల ప్రకారం.. మందర్న మంజీరా నదీ పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో రెవెన్యూ సిబ్బంది నిఘా పెట్టారు. మందర్న నుంచి ఇసుక లోడుతో వస్తున్న వాహనాలను సాలూర శివారులో అడ్డుకుని తనిఖీ చేయగా, ఎటువంటి అనుమతులు లేవని తేలింది. దీంతో రెండు ట్రాలీ ఆటోలను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ హెచ్చరించారు.
Views: 10
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

