కూరగాయలు అమ్ముకునే స్థాయి నుంచి.. మేయర్ పీఠం వరకు : ఇదీ కాంగ్రెస్ మార్క్

కూరగాయలు అమ్ముకునే స్థాయి నుంచి.. మేయర్ పీఠం వరకు : ఇదీ కాంగ్రెస్ మార్క్

దాదాపు పది సంవత్సరాల నిరీక్షణ తర్వాత నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిరూపించుకుంది. నిజామాబాద్ పట్టణంతో పాటు జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. సాధారణ కూరగాయలు, పండ్లు అమ్ముకునే నేపథ్యం నుంచి వచ్చిన ఉమారాణిని మేయర్‌గా ఎన్నుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తలకు అగ్రతాంబూలం ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సామాన్యులకే అగ్రతాంబూలం: పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్
"పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నిజామాబాద్ ప్రజలు కాంగ్రెస్‌పై నమ్మకం ఉంచారు. ఒక చిన్న స్థాయి నుంచి, కూరగాయలు, పళ్ళు అమ్ముకుని జీవనం సాగించిన ఉమారాణి-రమేష్ కుమార్ దంపతుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. సామాన్య కార్యకర్తకు మేయర్ పీఠం దక్కడం కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిజామాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం."

 

అభివృద్ధి కోసమే ఈ కలయిక: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక లహదారులు  సుదర్శన్ రెడ్డి
"మేము ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు, స్వతంత్రంగానే పోరాడాం. కానీ ఎన్నికల తర్వాత పట్టణ అభివృద్ధి ముఖ్యం. నిజామాబాద్ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందాలనే ఉద్దేశంతో మాతో కలిసి వచ్చే వారిని కలుపుకుపోతున్నాం. గత పదేళ్లుగా అభివృద్ధి కుంటుపడింది. గతంలో కాంగ్రెస్ హయాంలోనే మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి. మళ్ళీ అదే స్ఫూర్తితో విద్యా, వైద్య రంగాలను తీర్చిదిద్దుతాం."

 

మత రాజకీయాలకు చెక్:  రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
"మతాలు, దేవుళ్లను రాజకీయాల్లోకి లాగి పబ్బం గడుపుకునే వారికి నిజామాబాద్ ఓటర్లు గట్టి గుణపాఠం చెప్పారు. కొన్ని చోట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినా, జిల్లా మొత్తం కాంగ్రెస్ వైపే నిలిచింది. బోధన్, ఆర్మూర్, భీమగల్ మున్సిపాలిటీల్లో క్లీన్ స్వీప్ చేయడమే దీనికి నిదర్శనం. ఇది ప్రజల విజయం, అభివృద్ధి విజయం."
Views: 19
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు