హైదరాబాద్‌ వేదికగా 23వ అంతర్జాతీయ సదస్సు

నేటి నుంచే ‘బయో ఏషియా-2026’.. ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ వేదికగా 23వ అంతర్జాతీయ సదస్సు

ప్రపంచస్థాయి నిపుణులు, శాస్త్రవేత్తల మేధోమథనం

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 23వ ‘బయో ఏషియా-2026’ అంతర్జాతీయ సదస్సుకు భాగ్యనగరం సర్వం సిద్ధమైంది. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మంగళవారం నుంచి రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 17, 18) ఈ సదస్సు జరగనుంది. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈ మెగా ఈవెంట్‌ను అధికారికంగా ప్రారంభించి, కీలక ప్రసంగం చేయనున్నారు.
సాంకేతికతతో జీవశాస్త్ర విప్లవం
ఈ ఏడాది సదస్సును ‘టెక్‌బయో అన్‌లీష్డ్ - ఏఐ, ఆటోమేషన్, జీవశాస్త్ర రంగంలో వస్తున్న విప్లవాత్మక పరిణామాలు’ అనే ప్రధాన థీమ్‌తో నిర్వహిస్తున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ మరియు ఆటోమేషన్ వంటి సాంకేతికతలను జోడించడం ద్వారా భవిష్యత్తులో ఆరోగ్య సంరక్షణ ఏ విధంగా మారుతుందనే అంశంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారించనుంది. లైఫ్ సైన్సెస్ రంగంలోని ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు తమ నూతన ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించనున్నాయి. దీనిని ముఖ్యమంత్రి గారు ప్రారంభించనున్నారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు, పెన్సిల్వేనియా వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ బ్రూస్ ఎల్ లెవిన్, అమెరికా ఫార్మా దిగ్గజం 'ఆమ్జెన్' చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ హోవర్డ్ వై చాంగ్ కీలకోపన్యాసం చేస్తారు.  ‘తెలంగాణ రైజింగ్ 2047’, నెక్స్ట్ జనరేషన్ బయోలాజిక్స్, ఫార్మా-బయోటెక్ భవిష్యత్తు, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ వంటి అంశాలపై జాతీయ, అంతర్జాతీయ నిపుణులు చర్చించనున్నారు.
గ్లోబల్ హబ్‌గా తెలంగాణ
భారతదేశం టెక్‌బయో ఇన్నోవేషన్స్‌లో గ్లోబల్ హబ్‌గా ఎదుగుతున్న తరుణంలో, ఈ సదస్సు ద్వారా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. వివిధ దేశాల నుంచి సుమారు 50కి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. WhatsApp Image 2026-02-16 at 5.26.33 PM
Views: 28
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు