సాలూరలో మిన్నంటిన కుస్తీ పోటీల సందడి

- ఘనంగా శివరాత్రి ఉత్సవాలు.. ఉత్సాహంగా కొనసాగిన జాతర

సాలూరలో మిన్నంటిన కుస్తీ పోటీల సందడి

సాలూర మండల కేంద్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటాయి. పండుగను పురస్కరించుకుని సోమవారం నిర్వహించిన కుస్తీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. తరతరాలుగా వస్తున్న ఆనవాయితీని పాటిస్తూ నిర్వహించిన ఈ మల్లయుద్ధ విన్యాసాలు అశేష జనవాహినిని అలరించాయి. శివనామస్మరణతో మారుమోగుతున్న ప్రాంగణంలో, పహిల్వాన్లు తమ భుజబలాన్ని ప్రదర్శిస్తూ హోరాహోరీగా తలపడ్డారు. చిన్నపిల్లల ఆటవస్తువులు, మిఠాయి దుకాణాలు, రంగుల రాట్నాలతో జాతర ప్రాంగణం కళకళలాడింది.  గ్రామ పోలీస్ పటేల్ వెంకట్ పటేల్ మాట్లాడుతూ.. పురాతన కాలం నుండి వస్తున్న ఈ కుస్తీ పోటీల సంప్రదాయాన్ని కాపాడటం మన బాధ్యతని, నేటి యువతకు ఈ క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకే ఏటా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గెలుపొందిన విజేతలకు గ్రామ కమిటీ ప్రతినిధులు నగదు బహుమతులను అందజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామా పెద్దలు సొక్క రవి, లోకప్పగారి లక్ష్మణ్, సంగేపు భూమయ్య,  ఇల్తెపు గంగారాం, బుద్దే లక్ష్మణ్, నీరడి నగేష్, గంటె లక్ష్మణ్, వార్డు సభ్యులు, గ్రామ యువకులు, పెద్దలు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.1

Views: 48
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు