ప్రజా తీర్పు.. సంక్షేమానికే పట్టం

మున్సిపల్ పోరులో కాంగ్రెస్ విజయభేరి

ప్రజా తీర్పు.. సంక్షేమానికే పట్టం

విద్వేష రాజకీయాలను తిరస్కరించిన జనం: పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్

 2
రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకే జై కొట్టారని, విపక్షాల కుట్రలను తిప్పికొట్టి కాంగ్రెస్ వైపు నిలిచారని పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్య విజయమని ఆయన అభివర్ణించారు.

 

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 నుంచి 75 శాతం మున్సిపల్ వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం హర్షణీయమని మహేశ్‌కుమార్‌ గౌడ్ పేర్కొన్నారు. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ వంటి నగరాల్లో బీజేపీ, ఎంఐఎంలు మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూశాయని, అయితే అవేవీ ప్రజల ముందు సాగలేదని ఆయన విమర్శించారు. అభివృద్ధిని కాంక్షించే ఓటరు మతతత్వ శక్తులకు తగిన బుద్ధి చెప్పారని వివరించారు.

 

బీఆర్‌ఎస్, బీజేపీలు తెరవెనుక లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నప్పటికీ, కనీసం 25 శాతం సీట్లు కూడా సాధించలేక పోవడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో నిజామాబాద్‌లో కేవలం రెండు సీట్లకే పరిమితమైన కాంగ్రెస్, నేడు 18 నుంచి 20 స్థానాల్లో విజయం సాధించడం పార్టీ క్షేత్రస్థాయి బలానికి నిదర్శనమని చెప్పారు. ఈ విజయం ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీ శ్రేణుల సమష్టి కృషి వల్లనే సాధ్యమైందని కొనియాడారు.

 

నగర అభివృద్ధి మా ప్రాధాన్యత. రాబోయే జీహెచ్‌ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహంతో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
Views: 9
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు