కెనాల్‌లో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

కెనాల్‌లో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

నిజామాబాద్ జిల్లాఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కాలువలో పడి హఫీజ్ అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. గ్రామ సమీపంలోని నిజాంసాగర్ కెనాల్ వద్ద సదరు బాలుడు తన మిత్రులతో కలిసి ఆడుకుంటుండగా, అకస్మాత్తుగా కాలువలో పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో బాలుడు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. కొంత సమయం తర్వాత గ్రామ శివారులో బాలుడి మృతదేహం నీటిపై తేలుతూ కనిపించడంతో స్థానికులు బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటివరకు కళ్లముందే ఆడుకున్న చిన్నారి విగతజీవిగా మారడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.

Views: 6
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు