చెత్త కనిపిస్తే సహించేది లేదు

హైదరాబాద్‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్

చెత్త కనిపిస్తే సహించేది లేదు

రాష్ట్ర రాజధానిలో పారిశుద్ధ్య నిర్వహణపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మున్సిపల్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి (CURE) పరిధిలో పరిశుభ్రత విషయంలో అశ్రద్ధ వహిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

క్షేత్రస్థాయిలో నేనే తనిఖీ చేస్తా..

నగరంలో ఎక్కడైనా చెత్త కనిపిస్తే సహించను. నేనే స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తా అని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి నగర పాలక సంస్థల కమిషనర్లు ప్రతిరోజూ తెల్లవారుజామున 6 గంటలకే క్షేత్ర పర్యటనలు ప్రారంభించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని సూచించారు.

ఆదాయానికి గండి కొడితే కఠిన చర్యలు

నగరంలో ప్రకటనల ద్వారా వస్తున్న ఆదాయంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ముంబయి, అహ్మదాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ప్రకటనల ద్వారా వస్తున్న ఆదాయంతో పోల్చి చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ప్రకటనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మొత్తం ప్రకటనల బోర్డుల్లో 10 శాతం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికే కేటాయించాలి.

నగరానికి కొత్త హంగులు..

నగరాన్ని మరింత స్మార్ట్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం పలు కీలక సూచనలు చేశారు:

  • విద్యుత్ కేబుళ్లు, సీసీ కెమెరాలు, అడ్వర్టైజ్‌మెంట్ బోర్డుల కోసం స్మార్ట్ పోల్స్ ఏర్పాటును పరిశీలించాలి.

  • నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో మరియు ప్రైవేటు భూముల్లో పార్కింగ్ సమస్య పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుపై అధ్యయనం చేయాలి.

  • రాష్ట్రవ్యాప్తంగా వీధి దీపాల నిర్వహణలో పారదర్శకత కోసం యూనికోడ్ విధానాన్ని అమలు చేయాలి.

నూతనంగా ఎన్నికైన మేయర్లు, ఛైర్మన్లు, డిప్యూటీలకు పట్టణాభివృద్ధిపై అవగాహన కల్పించేందుకు త్వరలోనే ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Views: 9
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు