ములుగు జిల్లాలో మావోయిస్టుల కరపత్రాల కలకలం.
On
వాజేడు,సెప్టెంబర్ 20,(డిడి9 వార్త):
ములుగు జిల్లా వ్యాప్తంగా మావోయిస్టుల కరపత్రాలు వెలుగులోకి వచ్చాయి. వెంకటాపురం, పాతపురం గ్రామం నుండి టేకులబోరు గ్రామ శివారు వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా కేంద్ర కమిటీ భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ పేరిట కరపత్రాలు వెలిసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ నెల 21 నుండి 27 వరకు మావోయిస్టు 21వ స్థాపన వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ కాగర్ తిప్పి కొట్టాలని, పార్టీని బలోపేతం చేయాలని మావోయిస్టులు కరపత్రాల ద్వారా సందేశం ఇచ్చారు.
ఈ కరపత్రాలు వెలుగులోకి రావడంతో స్థానిక ప్రజల్లో భయం నెలకొంది. పోలీసులు అప్రమత్తం అవుతూ, కరపత్రాలు వెలిసిన ప్రదేశాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
Views: 76
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

