కల్దుర్కి, చిన్న మామది గ్రామాల్లో ఛత్రపతి శివాజీ ఉత్సవాలు

కల్దుర్కి, చిన్న మామది గ్రామాల్లో ఛత్రపతి శివాజీ ఉత్సవాలు

బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జనని యూత్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో కేసరి ధ్వజావిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిట్ల కృష్ణ మహరాజ్, జిల్లా దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రసాద్ పటేల్, మహారాష్ట్ర భజరంగ్ దళ్ ఉపాధ్యక్షులు గజానన్ పటేల్, ప్రముఖ వక్త ఉమేష్ దాండేగావ్ కార్ హాజరై ప్రసంగించారు. శివాజీ మహరాజ్ చూపిన ధైర్యం, దేశభక్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, హిందూ ధర్మ పరిరక్షణలో ఆయన పోరాటం అజరామరమని వారు కొనియాడారు. నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.
కల్దుర్కిలో కార్యక్రమం అనంతరం అతిథులు చిన్న మామది గ్రామంలో జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్తులు, యువకులు ఐకమత్యంతో మెదలాలని, గ్రామంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ భవ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరారు. ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ జ్యోతి శంకర్ ప్రత్యేకంగా పాల్గొని శివయ్యకు నివాళులర్పించారు. వారితో పాటు గ్రామ పెద్దలు ప్రకాష్ పటేల్, నాన పటేల్, శ్రీనివాస్, గంగాధర్, బాబు మరియు జనని యూత్ సభ్యులు అశోక్, బాలు, రాము, సతీష్, మహేష్, శివ తదితరులు పాల్గొన్నారు. యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై శివాజీ నినాదాలతో గ్రామాన్ని హోరెత్తించడంతో కల్దుర్కి, చిన్న మామది గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

c

Views: 15
Tags:

About The Author

Latest News

వార్షిక పద్దుపై కసరత్తు.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వార్షిక పద్దుపై కసరత్తు.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
తెలంగాణ రాష్ట్ర రాజకీయ, పరిపాలనా ముఖచిత్రంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సచివాలయ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర...
బాన్సువాడలో ఉద్రిక్తతలకు చెక్ – 3 గంటల్లో పరిస్థితి అదుపులోకి, 19 మంది అరెస్ట్
దేవాదులకు సీఎం రేవంత్ 'జల' సిరి.. భూసేకరణకు రూ. 600 కోట్లు!
పేదల కల సాకారం — బరంగ్ ఏడ్గిలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభం
చేతన్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం
పోతంగల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సాజి పటేల్ ఏకగ్రీవం
భీంగల్ మున్సిపల్ పాలకవర్గానికి ఘన సన్మానం