హంగార్గలో 'మన ఇసుక' వాహనం సేవలు ప్రారంభం

హంగార్గలో 'మన ఇసుక' వాహనం సేవలు ప్రారంభం

నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని హంగార్గ గ్రామంలో 'మన ఇసుక' వాహనం సేవలను తహసీల్దార్ గంగాధర్, గ్రామ సర్పంచ్ ఉదయ్ భాస్కర్ కలిసి శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక రవాణాను సులభతరం చేసేందుకు ఈ వాహనం అందుబాటులోకి వచ్చినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. గత కొంతకాలంగా ఇసుక రవాణా విషయంలో ట్రాక్టర్ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని 'మన ఇసుక' యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే సౌలభ్యం కలగడం పట్ల ట్రాక్టర్ యూనియన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా వాహనదారులకు వేధింపులు తప్పుతాయని సర్పంచ్ ఉదయ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు.

Views: 9
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు