బోధన్ లో కన్నులపండువగా బోనాల ఉత్సవాలు

పోచమ్మ, మహాలక్ష్మి అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించిన భక్తులు

బోధన్ లో కన్నులపండువగా బోనాల ఉత్సవాలు

బోధన్ పట్టణంలో ఆషాఢ బోనాల కోలాహలం మిన్నంటింది. బురుడ్గల్లిలో మహేంద్ర మేదరి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆషాఢ మాసం ఆఖరి రోజును పురస్కరించుకుని బోనాల పండుగను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళవాయిద్యాల మోతలు, శివసత్తుల పూనకాల నడుమ కాలనీ మహిళలు, చిన్నారులు పసుపు కుంకుమలు, వేపకొమ్మలతో శోభాయమానంగా అలంకరించిన బోనాలను ఎత్తుకుని ఊరేగింపుగా తరలివెళ్లారు. పాన్‌గల్లిలోని శ్రీ పెద్ద పోచమ్మ ఆలయంలోనూ, షర్బతి కెనాల్ ఏరియాలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలోనూ అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు వర్ధిల్లాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవార్లను ప్రార్థించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో మల్లారం ప్రకాష్, సాయిలు, శంకర్, గంగాధర్, శ్రీనివాస్, సందీప్, శివకుమార్, శైలేష్, శ్రీకాంత్, కాలనీవాసులు విశేషంగా పాల్గొన్నారు.

Views: 6
Tags:

About The Author

Latest News