కస్తూర్బా విద్యార్థినుల బోనాల సందడి
By R.Suresh
On
సంప్రదాయ దుస్తుల్లో అలరించిన విద్యార్థినులు
భీమ్‌గల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం బోనాల పండుగ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డీ.అనురాధ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులు ధరించి, శివసత్తులు, పోతరాజుల వేషధారణలతో అలరించారు. పూలతో అలంకరించిన బోనాలను నెత్తిన ధరించి ప్రాంగణంలో ఊరేగింపుగా వెళ్లారు. జానపద గీతాలకు విద్యార్థినులు నృత్యాలు చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని ప్రిన్సిపాల్ ఈ సందర్భంగా విద్యార్థినులకు సూచించారు.
Views: 0
Tags:
About The Author
Latest News
12 Aug 2026 11:01:00
మహిళా సంఘాల సభ్యులు రుణాలు తీసుకుని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని గ్రామ సర్పంచ్ వన్నెల బాలమని జనార్ధన్ పిలుపునిచ్చారు. బాచన్‌పల్లి గ్రామంలో...

