వేడుకగా 'గోరింటాకు'.. సందడిగా వనభోజనాలు
నాగన్‌పల్లిలో కన్నులపండువగా ఆషాఢ మాస వేడుకలు
By R.Suresh
On
బోధన్ మండల పరిధిలోని నాగన్‌పల్లి గ్రామంలో ఆషాఢ మాస వేడుకలు కన్నులపండువగా సాగాయి. వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్‌ల ఆధ్వర్యంలో మంగళవారం గోరింటాకు, వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలంతా ఒకచోటకు చేరి సంప్రదాయ పద్ధతిలో గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు. అనంతరం అందరూ కలిసి వనభోజనం చేశారు. ఈ వేడుకల్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు విశ్వనాథం శ్రీనివాస్, గట్టు రాణి, బొంపల్లి రాజు, ఎక్కలి రామకృష్ణ, బిళ్లకంటి అనిల్, వావిలాల రాజకిషన్, క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కిరణ్, సాయికుసులు, రాజు, వనిత క్లబ్ ప్రతినిధులు స్వప్న, రజిత తదితర సభ్యులు విశేషంగా పాల్గొన్నారు.
Views: 42
Tags:
About The Author
Latest News
12 Aug 2026 10:47:02
నిజామాబాద్ సీపీ పి.సాయి చైతన్య

