సీఈఐఆర్ పోర్టల్‌తో 8 ఫోన్ల రికవరీ

బాధితులకు అందజేసిన భీమ్‌గల్ పోలీసులు

సీఈఐఆర్ పోర్టల్‌తో 8 ఫోన్ల రికవరీ

భీమ్‌గల్ మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో బాధితులు పోగొట్టుకున్న 8 సెల్‌ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోలీసులు ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన ఫోన్లను పోలీస్‌స్టేషన్‌లో యజమానులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన అనంతరం CEIR పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్‌ను త్వరితగతిన ట్రేస్ చేసి రికవరీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెల్‌ఫోన్లను సమర్థవంతంగా రికవరీ చేసిన కానిస్టేబుల్ టి. నారాయణను ఎస్సై ప్రత్యేకంగా అభినందించారు.

 

Views: 3
Tags:

About The Author

Latest News

భాగస్వామ్యంతోనే మహిళల ఆర్థికాభివృద్ధి భాగస్వామ్యంతోనే మహిళల ఆర్థికాభివృద్ధి
మహిళా సంఘాల సభ్యులు రుణాలు తీసుకుని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని గ్రామ సర్పంచ్ వన్నెల బాలమని జనార్ధన్ పిలుపునిచ్చారు. బాచన్‌పల్లి గ్రామంలో...
భద్రతకు రక్షణ కవచం.. సీసీ కెమెరాలు
కస్తూర్బా విద్యార్థినుల బోనాల సందడి
పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేయాలి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
శిశు మరణాల అడ్డుకట్టకు ప్రత్యేక ప్రణాళిక
సీఈఐఆర్ పోర్టల్‌తో 8 ఫోన్ల రికవరీ