పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేయాలి
By R.Suresh
On
నిజామాబాద్ సీపీ పి.సాయి చైతన్య
నిజామాబాద్ డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని సీపీ పి. సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో డివిజన్ స్థాయి పోలీసు అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి దందాపై ఉక్కుపాదం మోపాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లు గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. స్టేషన్లలో రిసెప్షన్ నిర్వహణ బాగుండాలని, ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో ఏసీపీలు ప్రకాష్ యాదవ్, గురునాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Views: 1
Tags:
About The Author
Latest News
12 Aug 2026 11:01:00
మహిళా సంఘాల సభ్యులు రుణాలు తీసుకుని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని గ్రామ సర్పంచ్ వన్నెల బాలమని జనార్ధన్ పిలుపునిచ్చారు. బాచన్‌పల్లి గ్రామంలో...

