ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

ఆర్మూర్ పట్టణ గుండ్ల చెరువు సమీపంలో వనమహోత్సవంలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సురేఖ పిలుపు మేరకు పచ్చదనం పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో 16 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, నాటిన మొక్కలను జియో ట్యాగింగ్ ద్వారా రక్షిస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక చొరవతో ప్రతి ఇంట్లో మొక్కలు నాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గోనె లహరి రఘు, పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Views: 1
Tags:

About The Author

Latest News

భాగస్వామ్యంతోనే మహిళల ఆర్థికాభివృద్ధి భాగస్వామ్యంతోనే మహిళల ఆర్థికాభివృద్ధి
మహిళా సంఘాల సభ్యులు రుణాలు తీసుకుని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని గ్రామ సర్పంచ్ వన్నెల బాలమని జనార్ధన్ పిలుపునిచ్చారు. బాచన్‌పల్లి గ్రామంలో...
భద్రతకు రక్షణ కవచం.. సీసీ కెమెరాలు
కస్తూర్బా విద్యార్థినుల బోనాల సందడి
పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేయాలి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
శిశు మరణాల అడ్డుకట్టకు ప్రత్యేక ప్రణాళిక
సీఈఐఆర్ పోర్టల్‌తో 8 ఫోన్ల రికవరీ