ఈ నెల 9న చెరుకు రైతుల సన్నాహక సమావేశం

ఈ నెల 9న చెరుకు రైతుల సన్నాహక సమావేశం

బోధన్ నియోజకవర్గ పరిధిలో మూతపడిన ఎన్‌సీఎస్‌ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం నిర్వహించిన రైతు సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ​రైతాంగానికి ఆర్థిక ధైర్యాన్ని, భరోసానిచ్చేది ఒక్క చెరుకు పంట మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. సారంగపూర్ ఫ్యాక్టరీని బెల్లం ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ. 100 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 9న సారంగపూర్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో చెరుకు రైతుల సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని రైతులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆకుల పాపయ్య పిలుపునిచ్చారు.

 

Views: 17
Tags:

About The Author

Latest News

వేడుకగా 'గోరింటాకు'.. సందడిగా వనభోజనాలు వేడుకగా 'గోరింటాకు'.. సందడిగా వనభోజనాలు
బోధన్ మండల పరిధిలోని నాగన్‌పల్లి గ్రామంలో ఆషాఢ మాస వేడుకలు కన్నులపండువగా సాగాయి. వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్‌ల ఆధ్వర్యంలో మంగళవారం గోరింటాకు, వనభోజన కార్యక్రమాన్ని...
బోధన్ లో కన్నులపండువగా బోనాల ఉత్సవాలు
మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'!
ఎట్టకేలకు స్మశాన వాటికకు విద్యుత్ కనెక్షన్
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి బోనాలు ప్రతీక
బాన్సువాడలో కుక్కల బీభత్సం
మానవత్వంతో మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి విద్యార్థులు