భాగస్వామ్యంతోనే మహిళల ఆర్థికాభివృద్ధి
By R.Suresh
On
మహిళా సంఘాల సభ్యులు రుణాలు తీసుకుని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని గ్రామ సర్పంచ్ వన్నెల బాలమని జనార్ధన్ పిలుపునిచ్చారు. బాచన్‌పల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐకేపీ సీనియర్ సీసీలు కుంట శ్రీనివాస్, పురస్తు నరేష్ మాట్లాడుతూ.. ప్రతి సభ్యురాలు శ్రీనిధి, బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించి గ్రామ సంఘానికి లాభాలు తెచ్చేలా పనిచేయాలన్నారు. అనంతరం గ్రామ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా కర్ర సంతోషి, ఉపాధ్యక్షురాలిగా కందకూర్తి లాస్య, కార్యదర్శిగా దొంతుల కావేరి, సహాయ కార్యదర్శిగా లక్ష్మి, కోశాధికారిగా వైష్ణవిలను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వీఓఏ నాగమణి, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 4
Tags:
About The Author
Latest News
12 Aug 2026 11:01:00
మహిళా సంఘాల సభ్యులు రుణాలు తీసుకుని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని గ్రామ సర్పంచ్ వన్నెల బాలమని జనార్ధన్ పిలుపునిచ్చారు. బాచన్‌పల్లి గ్రామంలో...

