అక్రమ ఇసుక ఆటో పట్టుబడి... వదిలేశారా?

బోధన్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఉదంతం

అక్రమ ఇసుక ఆటో పట్టుబడి... వదిలేశారా?

స్థానికుల ఆరోపణలు.. పరిశీలిస్తామన్న సీఐ

 
అక్రమ ఇసుక రవాణాపై జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలు ఒకవైపు... క్షేత్రస్థాయి కొందరు సిబ్బంది వైఖరి మరోవైపు అన్నట్లుగా తయారైంది బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిస్థితి. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న ఓ ఆటోను పట్టుకున్న పోలీసులు.. దాన్ని స్టేషన్‌కు తరలించకుండానే అక్కడికక్కడే వదిలిపెట్టారనే వ్యవహారం తాజాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అక్కడికక్కడే సాగనంపారా?

​స్థానికుల కథనం ప్రకారం... బోధన్ పట్టణ పరిధిలోని బొర్రా గణపతి మందిరం వద్ద నిజామాబాద్ వెళ్లే రోడ్డు మార్గం లో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ఓ ఆటోను టౌన్ పోలీస్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే, దాన్ని స్టేషన్‌కు తరలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉండగా, అక్కడికక్కడే సాగనంపడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆటోను వదిలేయడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాలకు విరుద్ధంగా...

​జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక దందాపై ఉక్కుపాదం మోపాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సీపీ పదేపదేw హెచ్చరిస్తున్నారు. ఉన్నతాధికారి ఆదేశాలు అలా ఉంటే... క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం: సీఐ వెంకట నారాయణ 

​ఈ వ్యవహారంపై బోధన్ టౌన్ సీఐ వెంకట నారాయణ ను వివరణ కోరగా.... అక్రమ ఇసుక రవాణాను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ఆటోను వదిలిపెట్టారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, ఇందులో సిబ్బంది ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Views: 302
Tags:

About The Author

Latest News

వేడుకగా 'గోరింటాకు'.. సందడిగా వనభోజనాలు వేడుకగా 'గోరింటాకు'.. సందడిగా వనభోజనాలు
బోధన్ మండల పరిధిలోని నాగన్‌పల్లి గ్రామంలో ఆషాఢ మాస వేడుకలు కన్నులపండువగా సాగాయి. వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్‌ల ఆధ్వర్యంలో మంగళవారం గోరింటాకు, వనభోజన కార్యక్రమాన్ని...
బోధన్ లో కన్నులపండువగా బోనాల ఉత్సవాలు
మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'!
ఎట్టకేలకు స్మశాన వాటికకు విద్యుత్ కనెక్షన్
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి బోనాలు ప్రతీక
బాన్సువాడలో కుక్కల బీభత్సం
మానవత్వంతో మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి విద్యార్థులు