జయశంకర్ సిద్ధాంతాలే తెలంగాణకు దిక్సూచి

జయశంకర్ సిద్ధాంతాలే తెలంగాణకు దిక్సూచి

తెలంగాణ సిద్ధాంతకర్త, ఆత్మగౌరవ పోరాట పథ నిర్దేశకుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ చౌరస్తాలో ఘనంగా జరిగాయి. బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ... జయశంకర్ సార్ సిద్ధాంతాలే లేకుంటే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమయ్యేది కాదన్నారు. ఆయన బీసీ బిడ్డ కావడం గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన 1200 మంది అమరులలో సింహభాగం బీసీలేనని గుర్తుచేశారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల ప్రసాద్, అపర్ణ, చంద్రకాంత్, శ్రీనివాస్, నరసయ్య, రేఖ, అనిల్, సత్యనారాయణ, సదానంద్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20260806-WA0128

 

Views: 25
Tags:

About The Author

Latest News

మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'! మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'!
సాలూర మండల పరిధిలోని తగ్గెల్లి గ్రామ శివారు మంజీరా నదీ పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక బొలేరో వాహనాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం...
ఎట్టకేలకు స్మశాన వాటికకు విద్యుత్ కనెక్షన్
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి బోనాలు ప్రతీక
బాన్సువాడలో కుక్కల బీభత్సం
మానవత్వంతో మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి విద్యార్థులు
నకిలీ సర్టిఫికెట్లపై సమగ్ర విచారణ జరపాలి
హక్కుల కోసం పోరాడిన ఆదివాసీలకు ఘన నివాళి