పంటల మార్పిడితోనే వ్యవసాయం లాభసాటి : రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

నిజామాబాద్‌ ఐడీఓసీకి చేరుకున్న గవర్నర్.. ఘన స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, అధికారులు

పంటల మార్పిడితోనే వ్యవసాయం లాభసాటి :  రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

జిల్లాలో ‘ఎల్ నినో’ ప్రభావం ఉందా?.. అధికారులను ఆరా తీసిన గవర్నర్

పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించడం ద్వారానే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చని రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. మంగళవారం ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్‌తో కలిసి  ప్రత్యేక హెలికాప్టర్‌లో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

​గవర్నర్‌కు స్వాగతం పలికిన వారిలో ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పి.రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ట్రైనీ కలెక్టర్ సురేష్ ఉన్నారు. అక్కడ నుంచి ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహానికి చేరుకున్న గవర్నర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా జన్మదినం జరుపుకొంటున్న ఎంపీ అరవింద్‌కు గవర్నర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

​అనంతరం అతిథి గృహంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎల్ నినో ప్రభావం ఏమైనా ఉందా? అని వ్యవసాయ శాఖ అధికారులను ఆరా తీశారు. రైతులు ఒకే రకమైన పంటలపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసేలా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని కలెక్టర్ భవేష్ మిశ్రా గవర్నర్‌కు వివరించారు.

WhatsApp Image 2026-08-25 at 11.26.15 AM

Views: 34
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు