విచారణ నోటీసులపై ఆందోళన వద్దు: నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్
By R.Suresh
On
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో జారీ చేస్తున్నవిచారణ నోటీసుల విషయమై ఓటర్లు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్, అర్బన్ నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి దిలీప్ కుమార్ సూచించారు. 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ కాని వారికి, పేరు, వయస్సు వంటి వివరాల్లో వ్యత్యాసాలున్న వారికి మాత్రమే నోటీసులు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. బీఎల్‌ఓలు ఇళ్ల వద్దకే వచ్చి నోటీసులు అందిస్తున్నారని, నోటీసు అందుకున్న ఓటర్లు నిర్ణీత సమయానికి వేదిక వద్దకు హాజరై తగిన ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని కోరారు. ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలను సెప్టెంబర్ 16 వరకు తెలియజేయవచ్చని, విచారణ నోటీసుల పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 15 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఆధారాలు సమర్పిస్తే అర్హులైన వారి పేర్లను ఓటరు జాబితాలో కొనసాగిస్తామని ఆయన వివరించారు.
Views: 2
Tags:
About The Author
Latest News
30 Aug 2026 11:48:35
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త):
ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్...

