తల్లిపాలే బిడ్డకు తొలి టీకా... జీవితానికి రక్ష
సాలూర మండల వైద్యాధికారి విద్యా సాగర్
సాలూర రైతువేదికలో ఘనంగా 'ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
నవజాత శిశువు జన్మించిన మొదటి గంటలోనే ఇచ్చే ముర్రుపాలు తొలి టీకాగా పనిచేస్తూ, బిడ్డలో రోగనిరోధక శక్తిని పెంచుతాయని సాలూర మండల వైద్యాధికారి డాక్టర్ విద్యా సాగర్ తెలిపారు. బిడ్డ శారీరక, మానసిక వికాసానికి తల్లిపాలే అమృతమని, ప్రతి తల్లి తప్పనిసరిగా పాలు ఇవ్వాలని పేర్కొన్నారు.
సాలూర మండల కేంద్రంలోని రైతువేదికలో ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
శిశువు పుట్టిన ఆరు నెలల వరకు మంచినీళ్లు కూడా పట్టకుండా కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆ తర్వాత తగిన పోషకాహారంతో పాటు తల్లిపాలను కొనసాగించాలని సీడీపీవో నందిని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించడంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు మరింత చొరవ చూపాలని ఎంపీడీవో నర్సయ్య పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు గంగావేణి, శృతి, హెల్త్ సూపర్వైజర్ సాయికుమార్, సాలూర మండల అంగన్వాడీ టీచర్స్ గోదావరి, మాధవి, సునీత, సత్య గంగామణి, సరోజ ఆయా గ్రామాల తల్లులు, అంగన్వాడీ టీచర్స్, ఆశాల వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
.jpg)


