నేటి నుంచి జాన్కంపేట్‌లో పోలీస్ ఫైరింగ్ శిక్షణ
పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
By R.Suresh
On
పశువుల కాపరులు, రైతులకు ఎడపల్లి ఎస్సై, సర్పంచ్ హెచ్చరిక
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ)లో శనివారం నుంచి ఫైరింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎడపల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ ముత్యాల రమ ఒక ప్రకటన విడుదల చేశారు. నేటి నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.
ఉదయం 6 నుంచి 10 వరకు..
ఈ ఫైరింగ్ శిక్షణ ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఈ సమయంలో పీటీసీ పరిసర ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా చేను పనులకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. శిక్షణ జరుగుతున్న సమయంలో ఎవరూ కూడా ఆ ప్రాంతం వైపు వెళ్లరాదని, పశువులను అటువైపు తోలకూడదని స్పష్టం చేశారు.
ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి
ఎలాంటి అవాంఛనీయ, ప్రమాదకర సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు ఎస్సై రమ వివరించారు. పోలీస్ శిక్షణ సజావుగా సాగేందుకు స్థానిక గ్రామస్థులందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని ఆమె కోరారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సమాచారాన్ని పరిసర గ్రామాల ప్రజలందరికీ చేరవేయాలని గ్రామ సర్పంచ్ అనురాధ కిషన్ గౌడ్ స్థానికులకు విజ్ఞప్తి చేశారు.
Views: 28
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

