కుర్నాపల్లిలో వైభవంగా ప్రారంభమైన శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు

భక్తిశ్రద్ధలతో హోమాలు, గ్రామ ప్రదక్షిణ

కుర్నాపల్లిలో వైభవంగా ప్రారంభమైన శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో శ్రీ రేణుక మాత దేవస్థాన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. కుర్నాపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటల నుంచే సుప్రభాత సేవతో వేడుకలు మొదలయ్యాయి. అనంతరం గణపతి గౌరి పూజ, స్వస్తి పుణ్యహవచనం, గోమాత పూజ నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠాపన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అమ్మవారి విగ్రహానికి భక్తిశ్రద్ధలతో గ్రామ ప్రదక్షిణ నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ సాగిన ఈ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 11 గంటలకు శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహానికి 'జలాదివాసము' నిర్వహించి, ఆవాహిత మండప పూజలు, హోమాలు చేశారు. సాయంత్రం తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు.

ఈ ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. శనివారం ధాన్యాది వాసము, ఫలాదివాస పూజలు నిర్వహించనున్నారు. అత్యంత ప్రధానమైన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఆదివారం ఉదయం 10:40 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 24
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు