ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం
By R.Suresh
On
నిజామాబాద్ జిల్లా సాలూర మంజీరా పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టారస్ లారీని శనివారం పోలీసులు పట్టుకున్నారు. బోధన్ రూరల్ సీఐ విజయబాబు తెలిపిన వివరాల ప్రకారం... అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించి, లారీని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం వాహనాన్ని బోధన్ రూరల్ సర్కిల్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. అక్రమార్కులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Views: 34
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

