ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొంటున్న ఓటర్లు
బోధన్ కేంద్రాలను సందర్శించిన సబ్ కలెక్టర్
By R.Suresh
On
బోధన్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ప్రారంభమై కొనసాగుతోంది. ఈ సందర్భంగా పట్టణంలోని సమస్యాత్మక మరియు సాధారణ పోలింగ్ కేంద్రాలను సబ్ కలెక్టర్ వికాస్ మహతో క్షేత్రస్థాయిలో సందర్శించి పర్యవేక్షించారు. శక్కర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 57 నుంచి 62 కేంద్రాలను, ఘోషాలా రోడ్ ప్రాథమిక పాఠశాలలోని 79వ కేంద్రాన్ని, అలాగే సరస్వతి నగర్ విజేత జూనియర్ కళాశాలలోని 97, 98, 99 పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వికాస్ మహతో మాట్లాడుతూ.. పట్టణంలో పోలింగ్ సరళి సజావుగా సాగుతోందని, ఓటర్లకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఓటరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

Views: 14
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

