విచారణకు హాజరుకాకపోతే ఓటు రద్దు: బోధన్ ఆర్డీఓ విజయకుమారి

ఎస్‌ఐఆర్-2026 ప్రత్యక్ష విచారణను పరిశీలించిన ఆర్డీఓ

విచారణకు హాజరుకాకపోతే ఓటు రద్దు:  బోధన్ ఆర్డీఓ విజయకుమారి

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ఎస్‌ఐఆర్-2026 ప్రత్యేక సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు బోధన్ ఆర్డీఓ ఎం.విజయకుమారి తెలిపారు. ప్రక్రియలో భాగమైన ప్రత్యేక విచారణ కార్యక్రమాన్ని బోధన్ పట్టణంలోని గంజ్ రోడ్డులోని 61వ పోలింగ్ కేంద్రం వద్ద తహసీల్దార్‌ విట్టల్ తో, బోధన్ మండలం ఖండ్గావ్‌లోని 1వ కేంద్రం వద్ద ఎంపీడీఓతో కలిసి పర్యవేక్షించారు. ఆన్‌లైన్ ద్వారా ఓటర్ల వివరాలను సరిచూశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. నోటీసులు అందిన వ్యక్తులు నిర్దేశిత ధ్రువీకరణ పత్రాలతో విచారణకు హాజరుకాకపోతే ఓటు హక్కు రద్దయ్యే ప్రమాదముందని, ఓటర్లంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

 

Views: 4
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు