జాతీయ వేదికపై ‘తెలంగాణ’ సాంస్కృతిక వైభవం

జాతీయ వేదికపై ‘తెలంగాణ’ సాంస్కృతిక వైభవం

భారతీయ సాంస్కృతిక ప్రాతినిధ్యాన్ని, మన మట్టి వాసనలను జాతీయ వేదికపై సగర్వంగా ఆవిష్కరిస్తున్నారు మన రాష్ట్ర ఉపాధ్యాయులు. న్యూఢిల్లీలోని 'సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్'  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 21 రోజుల సుదీర్ఘ ఓరియంటేషన్ కోర్సులో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, సంప్రదాయ విశిష్టతను తమ ప్రదర్శనల ద్వారా చాటిచెబుతున్నారు.

నిజామాబాద్ జిల్లా బట్టు కళ్యాణి టిజిటి ఇంగ్లీష్, కే జి ఎఫ్ ఎస్ గుంజల్ యాచారం రంగారెడ్డి​ సారథ్యంలో ఈ ప్రతినిధి బృందం తెలంగాణ వైభవాన్ని నలుదిశలా చాటుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయిని కత్తి స్వరూప రాణి, నిర్మల్ జిల్లా కొత్తమద్దిపడగ ఎంపీయూపీఎస్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎస్.కిషోర్, నిజామాబాద్ జిల్లా బెజ్జోర జెడ్పీహెచ్‌ఎస్ ఆంగ్ల ఉపాధ్యాయుడు బి.శ్రీనివాస్ తదితరులు ఈ బృందంలో భాగస్వాములై మన కళారూపాలను, పండుగల ప్రాశస్త్యాన్ని జాతీయ వేదికపై విశేషంగా ప్రదర్శిస్తున్నారు.

​రాష్ట్ర సాంస్కృతిక ఘనతను దేశ రాజధానిలో సగర్వంగా ప్రతిబింబిస్తున్న ఈ ఉపాధ్యాయ బృందానికి పలువురు విద్యారంగ ప్రముఖులు, తోటి ఉపాధ్యాయులు హృదయపూర్వక అభినందనలు తెలిaయజేశారు.

 

IMG_20260826_145546

 

Views: 140
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు