యూరియా ఇప్పించాలని ఆర్‌డీవోకు రైతుల వినతి

యూరియా ఇప్పించాలని ఆర్‌డీవోకు రైతుల వినతి

ఫార్మర్ ఫర్టిలైజర్ యాప్‌లో వస్తున్న సాంకేతిక సమస్యల వల్ల తమకు యూరియా అందడం లేదని, సొసైటీ ద్వారా మ్యాన్యువల్‌గా పంపిణీ చేయించాలని కోరుతూ బోధన్ కు చెందిన రైతులు సోమవారం రెవెన్యూ డివిజినల్ అధికారిణి విజయ కుమారిని కలసి వినతిపత్రం సమర్పించారు. బోధన్ పట్టణంలోని దుద్యాల్, దౌత్యాల్, పాండు, బెల్లాల్, చెక్కి తర్పాలు గ్రామాల పేర్లు యాప్‌లో చూపించకపోవడంతో సొసైటీలో స్టాక్ ఉన్నప్పటికీ సిబ్బంది ఎరువులు ఇవ్వడం లేదని చిన్న, సన్నకారు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు యూరియా అత్యంత అవసరమైన తరుణంలో యాప్ సమస్య కారణంగా సరఫరా నిలిచిపోవడం దారుణమని పేర్కొన్నారు. వ్యవసాయ అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోయిందని, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సాంకేతిక లోపాన్ని సరిచేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు పట్టాదారు పాసుబుక్కుల ఆధారంగా మ్యాన్యువల్‌గా యూరియా బస్తాలు ఇప్పించి ఆదుకోవాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-08-24 at 8.01.57 PM (1)

Views: 11
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు