సాలూర చెక్‌పోస్ట్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

సాలూర చెక్‌పోస్ట్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యల్లో భాగంగా సాలూర అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద బోధన్ రూరల్ పోలీసులు గురువారం విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. బోధన్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పలువురిని బ్రీత్ ఎనలైజర్ల ద్వారా పరీక్షించి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండ పాటించాలని సూచించారు. తనిఖీల్లో పోలీస్ సిబ్బంది అంజాద్, గంగాధర్, శ్రావణ్, రమేష్ లు ఉన్నారు.

 

Views: 15
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు