మహిళా సంఘాలకు 35% సబ్సిడీతో రుణాలు
పిఎం ఎఫ్‌ఎమ్‌ఈ పథకం ద్వారా మహిళా సంఘాల సభ్యులకు 35 శాతం సబ్సిడీతో రుణాలు అందజేస్తున్నట్లు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాచయ్య తెలిపారు. భీంగల్ మండల సమాఖ్య సమావేశంలో పాల్గొన్న ఆయన గ్రామ సంఘాల మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా గొర్రెలు, మేకలు, కోళ్లు మరియు పాడి గేదెల పెంపకం కోసం రుణాలు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన మహిళలు బ్యాంకు అధికారులను సంప్రదించి పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల విద్యార్థుల కోసం గ్రామ సంఘాల మహిళలు చేపడుతున్న యూనిఫామ్ స్టిచ్చింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం ప్రమీల, సీసీలు కే.శ్రీనివాస్, వి.శ్రీనివాస్, రఘుపతి, గంగ సాయిలు, భాస్కర్, గంగాధర్, మండల సమాఖ్య అధ్యక్షురాలు సత్తెమ్మ, ఎంఎస్ ప్రతినిధి సుమలత తదితరులు పాల్గొన్నారు.
.jpeg)

