మలేషియాలో అదరగొట్టిన శస్వంత్‌కు ఘన సన్మానం

మలేషియాలో అదరగొట్టిన శస్వంత్‌కు ఘన సన్మానం

అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి గ్రామానికి, దేశానికి మంచి పేరు తెచ్చిన కమ్మర్‌పల్లి మండలం హాస కొత్తూరుకు చెందిన యంగ్ అథ్లెట్ చీర్లంచ శస్వంత్‌ను శుక్రవారం గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గ్రామానికి చెందిన చీర్లంచ వేణు - జ్యోతి దంపతుల కుమారుడైన శస్వంత్, మలేషియాలో జరిగిన ఛాంపియన్‌షిప్ 2026'లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించి సత్తా చాటాడు. ఈ సందర్భంగా సర్పంచ్ నలీమేళ గంగారెడ్డి మాట్లాడుతూ.. మన పల్లె నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన శస్వంత్‌ను అభినందించారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఏనుగు మనోహర్, మాజీ ఎంపీటీసీ తెడ్డు రాజన్న, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎడ్ల శ్రీకాంత్, వార్డు సభ్యులు కల్లెడ రాణి, కల్లెడ కాశవ్వ, నాయకులు జంగం మహేష్, దేవయి రాజేశ్వర్, శ్రీనివాస్, ఉట్నూర్ నరేష్, గోపి తదితరులు పాల్గొన్నారు.

Views: 0
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు