శివనామస్మరణతో మార్మోగిన ఆత్మలింగేశ్వరం

శివనామస్మరణతో మార్మోగిన ఆత్మలింగేశ్వరం

బోధన్ పట్టణంలోని బైపాసు రోడ్డు పాండుచెరువు ఒడ్డున గల ప్రసిద్ధ శ్రీ ఆత్మలింగేశ్వరాలయం శ్రావణమాస రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు కొప్పాక శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను కన్నులపండువగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాభిషేకాలు, రుద్రాభిషేకాలు, విశేష బిల్వార్చనలు ఘనంగా జరిగాయి. హరహర మహాదేవ.. శంభో శంకర నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది. భక్తులు దీపారాధనలు చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ మాసంలో పరమశివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం ద్వారా కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధకాగలవని అర్చకులు పేర్కొన్నారు.

WhatsApp Image 2026-08-24 at 7.50.10 PM

Views: 50
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు