తగిలేపల్లి మాజీ సర్పంచ్ హత్య ఘటనపై చట్టపరమైన విచారణ జరపాలి
మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌పై ఆరోపణలు సరికావు
పోచారం భాస్కర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏసీపీకి ఫిర్యాదు
:వర్ని మండలం తగిలేపల్లి మాజీ సర్పంచ్ వెంకటేశ్ హత్య ఘటనను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దని బీఆర్‌ఎస్ నాయకులు కోరారు. ఈ ఘటనను అడ్డం పెట్టుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ డీసీసీబీ మాజీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బుధవారం బోధన్ ఏసీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ... హత్య ఘటనతో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌పై భాస్కర్‌రెడ్డి అనుచిత విమర్శలు చేస్తూ, దిష్టిబొమ్మ దహనం చేయడాన్ని ఖండించారు. నిజమైన నిందితులెవరో సమగ్ర విచారణలో తేలాల్సి ఉందన్నారు. సున్నితమైన అంశంలో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న భాస్కర్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్‌ఎస్ నాయకులు జుబేర్, అంజిరెడ్డి, బీర్కూర్ సర్పంచ్ ధర్మతేజ, తెళ్ల రవికుమార్ తదితరులు ఉన్నారు.

