ఎస్సీ యువతి, యువకుల స్వయం ఉపాధికి దరఖాస్తుల ఆహ్వానం
By R.Suresh
On
సాలూర మండలంలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగ యువతీ యువకులు 2025-26 వార్షిక ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం కల్పిస్తున్న స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్ ఒక ప్రకటనలో కోరారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల ప్రకారం... ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రవాణా రంగం కింద ఎలక్ట్రిక్ టూ వీలర్, త్రీ వీలర్ వాహనాలు, మరియు వ్యవసాయాధారిత యూనిట్ల కింద సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోలర్ల పంపిణీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన వివరించారు. ముఖ్యంగా గిగ్ వర్కర్లు (జొమాటో, స్విగ్గీ, రాపిడో వంటి సంస్థల్లో పని చేసేవారు), ఎస్సీ వ్యవస్థాపకులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. సోలార్ పంపుల కోసం కనీసం రెండెకరాల భూమి ఉండాలని, గడిచిన ఐదేళ్లలో ఎస్సీ కార్పొరేషన్ లబ్ధి పొందని వారు మాత్రమే దీనికి అర్హులని స్పష్టం చేశారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 24వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో (https://tgobmms.cgg.gov.in) దరఖాస్తు చేసుకుని, ఆ పత్రాలను నిజామాబాద్‌లోని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు.

Views: 59
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

