బైకు అదుపుతప్పి ఒకరి మృతి.. మరొకరికి తీవ్రగాయాలు

బైకు అదుపుతప్పి ఒకరి మృతి.. మరొకరికి తీవ్రగాయాలు

ఎడపల్లి మండల కేంద్రం సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై ముత్యాల రమా తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రలోని దేగ్లూర్‌ తాలూకా చైన్‌పూర్‌ గ్రామానికి చెందిన గణపతి (42), పీరాజీ ద్విచక్రవాహనంపై నిజామాబాద్‌ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. ఎడపల్లి శివారులోకి రాగానే వాహనం అదుపుతప్పి కిందపడిపోయినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన గణపతి అక్కడికక్కడే మృతి చెందగా, పీరాజీకి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను బోధన్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పరిమితికి మించిన వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Views: 48
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు