నేరాల నియంత్రణే లక్ష్యంగా పని చేయాలి: నిజామాబాద్ సీపీ సాయి చైతన్య

సీఎంఆర్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి

నేరాల నియంత్రణే లక్ష్యంగా పని చేయాలి: నిజామాబాద్ సీపీ సాయి చైతన్య

వైట్ కాలర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయండి

జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపాలని, పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని పోలీస్ అధికారులతో ఆయన సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుల వారీగా పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ కేసుల్లో దర్యాప్తు నత్తనడకన సాగడంపై అసహనం వ్యక్తం చేసిన సీపీ, సాక్ష్యాధారాల సేకరణలో శాస్త్రీయ పద్ధతులను అవలంబించాలని, కోర్టుల్లో ప్రాసిక్యూషన్‌ను బలోపేతం చేయడం ద్వారా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పాత కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని ఒక క్రమపద్ధతిలో క్లియర్ చేయాలని సూచించారు.  నగరంలో పెరుగుతున్న వైట్ కాలర్ నేరాలు, సైబర్ మోసాలు మరియు ఆర్థిక నేరాల పట్ల సీపీ ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ ఫ్రాడ్స్, నకిలీ పత్రాల సృష్టి వంటి అంశాల్లో నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారని, వాటిని అరికట్టేందుకు పోలీసు అధికారులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని, బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి రికవరీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణను ప్రాధాన్యత అంశంగా పేర్కొన్న సీపీ, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ తక్షణమే సైన్ బోర్డులు, హెచ్చరిక గుర్తులు ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ మరియు రాష్ట్ర రహదారుల అధికారులతో సమన్వయం చేసుకుంటూ రోడ్డు ఇంజనీరింగ్ లోపాలను సరిదిద్దాలని లింక్ రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని సూచించారు. నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడంతో పాటు, మైనర్ డ్రైవింగ్, అతివేగం మరియు త్రిబుల్ రైడింగ్‌లపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వా రెడ్డి, నిజామాబాద్ ఏసీబీ బి.ప్రకాష్, బోధన్ ఏసీబీ శ్రీనివాస్, ఆర్మూర్ ఏసీబీ వెంకటేశ్వర రెడ్డి, సీటీసీ ఏసీబీ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ శ్రీశైలం, సీసీఆర్‌బీ సీఐలు రమేష్, అంజయ్య, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ఓ శ్రీలత మరియు ఇతర సీఐలు, ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 5
Tags:

About The Author

Latest News

ఒక్క చుక్క రక్తం… మరో ప్రాణానికి ఆశాకిరణం - సేవాభావంతో ముందుకు వచ్చిన యువత ఒక్క చుక్క రక్తం… మరో ప్రాణానికి ఆశాకిరణం - సేవాభావంతో ముందుకు వచ్చిన యువత
బీర్కూర్, మార్చి 01(డిడి9 వార్త): లయన్స్ క్లబ్ అఫ్ బీర్కూర్ ఆధ్వర్యంలో బీర్కూర్‌లోని మున్నూరుకాపు సంఘ భవనంలో నిర్వహించిన మహత్తర రక్తదాన శిబిరం ఘనవిజయం సాధించింది. సమాజ...
బాన్సువాడలో కళ్యాణలక్ష్మి–షాది ముభారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్లే పోచారం శ్రీనివాసరెడ్డి
ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి – కాంగ్రెస్ నాయకుల హామీ
తిరుమలపూర్‌లో ఉచిత వైద్య శిబిరం
లక్ష్యంతో చదివి.. ఉన్నతంగా ఎదగాలి : బోధన్ ఏసీపీ శ్రీనివాస్
భీమ్‌గల్‌లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
పసికందు హత్యపై రజక సంఘాల ఆగ్రహం