డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఎదగాలి: ఎడపల్లి ఐకేపీ ఏపీఎం రాజేందర్
సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని, ఇందుకోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని ఎడపల్లి మండల ఐకేపీ ఏపీఎం రాజేందర్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో జిల్లా సమైక్య అధ్యక్షురాలు హేమలత అధ్యక్షతన నిర్వహించిన ‘మండల మహాజన సభ’లో ఆయన మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాల మహిళలకు బ్యాంకులు, శ్రీనిధి, గ్రామ సమైక్యల ద్వారా సులభంగా రుణాలు అందుతున్నాయని తెలిపారు. ప్రతి సంఘానికి 1 లక్ష నుండి 2 లక్షల వరకు బ్యాంక్ లోన్లు ఇప్పిస్తున్నామని, మహిళలు తమ అవసరాలకు తగినట్లుగా రుణాలను వాడుకుని, సకాలంలో తిరిగి చెల్లించాలని సూచించారు. 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల జమ ఖర్చుల వివరాలను ఆయన సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఎడపల్లి మండల సమైక్యతో పాటు ఐకేపీ ఆర్థికంగా లాభాల్లో ఉందన్నారు.
మండల సమైక్య నూతన కార్యవర్గం ఎన్నిక
సమావేశం అనంతరం మండల మహిళా సమైక్య నూతన కార్యవర్గాన్ని స్వయం సహాయక సంఘాల మహిళలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏపీఎం రాజేందర్ సమక్షంలో నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి అభినందనలు తెలిపారు.

నూతన కార్యవర్గం వివరాలు:
-
అధ్యక్షురాలు: హేమలత (ఎడపల్లి)
-
ఉపాధ్యక్షురాలు: గీత (వడ్డేపల్లి)
-
కార్యదర్శి: మన్నేటి శ్రీదేవి (ఎంఎస్‌సి ఫారమ్)
-
సహాయ కార్యదర్శి: లక్ష్మి (జానకంపేట)
-
కోశాధికారి: సరోజినీ దేవి (తానాకలాన్)
ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ కోఆర్డినేటర్లు పాండురంగం, భాస్కర్, వినోద్ కుమార్, రాజయ్య, మధు, సాయిలు, రాము, శాంతకుమారి, సవితతో పాటు వివిధ గ్రామాల డ్వాక్రా సంఘాల ప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

