వరిలో సుడిదోమ నివారణపై రైతులకు అవగాహన

వరిలో సుడిదోమ నివారణపై రైతులకు అవగాహన

వరి పంటలో సుడిదోమ నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని జగిత్యాల వ్యవసాయ డిగ్రీ కళాశాల విద్యార్థినులు సూచించారు. సోమవారం సాలూర మండల కేంద్రంలోని  రైతు వేదికలో సుడిదోమ సమగ్ర యాజమాన్యంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రసన్న, వైష్ణవి, ఐశ్వర్య, నాగమణి, సింధు, స్వాతి మాట్లాడుతూ.. పొలంలో నీటిని మార్చి మార్చి ఆరబెట్టడంతో పాటు మోతాదుకు మించి నత్రజని ఎరువులను వాడకపోవడం ద్వారా దోమ ఉధృతిని తగ్గించవచ్చని తెలిపారు. రైతులు క్రమం తప్పకుండా పొలాలను పరిశీలిస్తూ దోమను ప్రారంభ దశలోనే గుర్తించి శాస్త్రీయ పద్ధతుల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Views: 16
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు