ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ బోధన్ మండల నూతన కమిటీల ఏర్పాటు

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ బోధన్ మండల నూతన కమిటీల ఏర్పాటు

ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు బోధన్ మండలంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన కమిటీలను మంగళవారం ఏర్పాటు చేశారు. కోపిరాల రామ్‌చందర్ మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మాసాయిపేట యాదగిరి మాదిగ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదగిరి మాదిగ మాట్లాడుతూ... సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామీణ, మండల, జిల్లా స్థాయిల్లో కమిటీలు వేస్తున్నట్లు చెప్పారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు క్షేత్రస్థాయి నుంచి ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. నూతన కమిటీల ఏర్పాటుతో మండలంలో సంస్థ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మటు పద్మ, జాతీయ కోర్ కమిటీ సభ్యురాలు యమునా మాదిగ, నియోజకవర్గ ఇన్‌చార్జి లసింగరి భూమయ్య మాదిగ, సీనియర్ నాయకులు గంధమల చంద్రయ్య మాదిగ, పులి ప్రవీణ్, మధు, భాను ప్రకాష్, బండారి గంగాధర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 28
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు