రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు 'నికిత, వెన్నెల' ఎంపిక

రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు 'నికిత, వెన్నెల' ఎంపిక

గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. కమ్మర్ పల్లి మండలం కోనసముందర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థినులు జిల్లా స్థాయి నెట్‌బాల్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని తీర్నన్పల్లి గ్రామంలో నిర్వహించిన సీఎం కప్ నెట్‌బాల్ క్రీడా పోటీల జిల్లా స్థాయి ఎంపికల్లో ఈ పాఠశాలకు చెందిన విద్యార్థినులు తమదైన ముద్ర వేశారు. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న నికిత, బి. వెన్నెల తమ క్రీడా నైపుణ్యంతో సెలక్టర్లను ఆకట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలల నుంచి వచ్చిన క్రీడాకారిణులతో పోటీ పడి, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్ర స్థాయి జట్టులో చోటు సంపాదించుకున్నారు. వీరు ఈ నెల ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు మహబూబ్ నగర్ పట్టణంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీల్లో నిజామాబాద్ జిల్లా తరపున బరిలోకి దిగనున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల పి.డి బి.రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థినుల పట్టుదల, క్రమం తప్పకుండా చేసిన సాధన వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ వీరు రాణించి జిల్లాకు పతకాలు తీసుకువస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.మధుపాల్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత పాఠశాల నుంచి రాష్ట్ర స్థాయికి విద్యార్థులు ఎంపికవ్వడం తమకు గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినుల ఎంపికపై కోనసముందర్ గ్రామ సర్పంచ్ బెజ్జారం రాకేష్, గ్రామ అభివృద్ధి కమిటీ (VDC) అధ్యక్షులు మేల్ల గంగాధర్ ప్రత్యేకంగా అభినందించారు. గ్రామంలోని ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ ప్రతినిధులు, ఉపాధ్యాయ బృందం క్రీడాకారిణులను ఘనంగా సత్కరించారు. రాష్ట్ర స్థాయిలోనూ వీరు మెరుగైన ఫలితాలు సాధించి, గ్రామానికి మరియు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని గ్రామ ప్రజలు ఆకాంక్షించారు.

Views: 84
Tags:

About The Author

Latest News

వార్షిక పద్దుపై కసరత్తు.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వార్షిక పద్దుపై కసరత్తు.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
తెలంగాణ రాష్ట్ర రాజకీయ, పరిపాలనా ముఖచిత్రంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సచివాలయ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర...
బాన్సువాడలో ఉద్రిక్తతలకు చెక్ – 3 గంటల్లో పరిస్థితి అదుపులోకి, 19 మంది అరెస్ట్
దేవాదులకు సీఎం రేవంత్ 'జల' సిరి.. భూసేకరణకు రూ. 600 కోట్లు!
పేదల కల సాకారం — బరంగ్ ఏడ్గిలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభం
చేతన్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం
పోతంగల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సాజి పటేల్ ఏకగ్రీవం
భీంగల్ మున్సిపల్ పాలకవర్గానికి ఘన సన్మానం