పసిపాప మృతిపై సాలూరలో నిరసన

నిందితులను కఠినంగా శిక్షించాలని రజక సంఘం డిమాండ్‌

పసిపాప మృతిపై సాలూరలో నిరసన

ఐలమ్మ విగ్రహం నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ

నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మృతి చెందిన ఘటనను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రజక కులస్థులు, బీసీ సంఘాల నాయకులు మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.  ర్యాలీ అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం ఇన్చార్జి తహశీల్దార్ అనుషకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అభం శుభం తెలియని పసిపాప ప్రాణాలు తీయడం అత్యంత క్రూరమైన చర్య అని ఇలాంటి అరాచకాలను నాగరిక సమాజం సహించేది లేదని మండిపడ్డారు. గణేష్ కుటుంబంపై దాడికి పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరిపించి ఉరిశిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, భారీ నష్టపరిహారంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. రజకులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక, బీసీ సంఘాల ప్రతినిదులు మల్లెపూల లక్ష్మణ్, నర్సింలు, అశోక్, శేఖర్, నగేష్, సురేష్, శంకర్, ముట్టెన్ ప్రకాష్, సింగడి పాండు,  ఇల్తెపు గంగారాం, సోక్కం రవి, కాటికే బాలు, చింతం నాగయ్య, రావుబా గంగాధర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.  
Views: 12
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు