ఇమ్మడి గోపి ముదిరాజ్ హత్య పిరికిపంద చర్య

ఇమ్మడి గోపి ముదిరాజ్ హత్య పిరికిపంద చర్య

ముదిరాజ్ సామాజిక వర్గ రాజకీయ చైతన్యంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇమ్మడి గోపి ముదిరాజ్ హత్యకు గురికావడం అత్యంత దారుణమని, ఇది పిరికిపంద చర్య అని నిజామాబాద్ జిల్లా యువజన విభాగం నాయకుడు సున్నపు ఓంకార్ తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ముదిరాజ్ సంఘం బలోపేతానికి గోపి ముదిరాజ్ విశేష కృషి చేశారని ఓంకార్ గుర్తు చేశారు. మండల పరిషత్ అధ్యక్షుడిగా ప్రజలతో మమేకమై, అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడిన నాయకుడిని కోల్పోవడం సమాజానికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజులను ఎల్లప్పుడూ ఆదుకునే నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉందన్నారు.  ఈ హత్యకు పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని సున్నపు ఓంకార్ డిమాండ్ చేశారు. ఘటనకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన కోరారు. ఇమ్మడి గోపి ముదిరాజ్ ఆశయాలను కొనసాగిస్తామని, దోషులను శిక్షించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.

Views: 52
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు