ప్రేమానురాగాలకు ప్రతీక రక్షాబంధన్ : ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా
By R.Suresh
On
సోదరభావానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఈ పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆకాంక్షించారు. సోదరీమణులకు ఏ ఆపద రాకుండా ఎల్లవేళలా అండగా ఉంటామని సోదరులు భరోసానివ్వడమే ఈ పండుగ విశిష్టత అని పేర్కొన్నారు. రాఖీ పండుగ కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుందని, మహిళలకు భద్రత, గౌరవం అందించాలనే సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. కులమతాలకు అతీతంగా మానవత్వాన్ని, ప్రేమానురాగాలను చాటే ఈ పర్వదినం మన సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతుందన్నారు. రాఖీ పౌర్ణమి వేడుకలు ప్రజల మధ్య ఆత్మీయతను మరింత పెంపొందించాలని వారు కోరారు.

Views: 0
Tags:
About The Author
Latest News
30 Aug 2026 11:48:35
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త):
ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్...

