బోధన్ లో ఘనంగా మేడపాటి ప్రకాష్‌రెడ్డి జన్మదిన వేడుకలు

బోధన్ లో ఘనంగా మేడపాటి ప్రకాష్‌రెడ్డి జన్మదిన వేడుకలు

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బోధన్ నియోజకవర్గ నాయకులు మేడపాటి ప్రకాష్‌రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మేడపాటి ప్రకాష్‌రెడ్డితో కలిసి నాయకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ బోధన్ పట్టణ అధ్యక్షులు పసులోటి గోపికిషన్ మాజీ పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలరాజు, సీనియర్ నాయకులు గుంత గంగాధర్, మాజీ కౌన్సిలర్ మాసిని వినోద్,పట్టణ ప్రధాన కార్యదర్శి మీర్జాపూర్ అరవింద్, నాయకులు పప్పుల వేణు, కందికట్ల వాసు, భూమయ్య, కలిగోట కృష్ణ, దుర్గా ప్రసాద్, గడ్డం శ్రీనివాస్, లింగు వినోద్, కన్నె శ్రీనివాస్, చరణ్, వినయ్, రవి కుమార్, ఫణీంద్ర , కిరణ్ ,నక్క రాము, శ్రీకాంత్ ,రాజు, పడాల శ్రీను, ఫణి, అనీల్, నర్సింహులు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

సాలూర మండలం హున్సా గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు నోట్‌బుక్స్, పండ్లను వితరణ చేశారు. సాలూర మండల ప్రజల తరఫున ప్రకాష్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ మండల అధ్యక్షులు రావుబా గంగాధర్, మాజీ అధ్యక్షులు అశోక్ గౌడ్, కార్యకర్తలు ఉమాకాంత్, కన్నా రాము, చీల మాధవరావు, మరిగే మాధవరావు, పల్లె నిఖిల్, మారుతి, సోమశంకర్, సంగు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

 

Views: 12
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు