గన్నారం, లింగాపూర్‌ గ్రామాల్లో ఉచిత కంటి వైద్య శిబిరం

గన్నారం, లింగాపూర్‌ గ్రామాల్లో ఉచిత కంటి వైద్య శిబిరం

నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని గన్నారం, లింగాపూర్‌ గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. లయన్స్ క్లబ్‌ ఆఫ్‌ బీర్కూర్ ఆధ్వర్యంలో బోధన్‌ లైన్స్‌ క్లబ్‌ సహకారంతో ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహకులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు నాణ్యమైన కంటి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. శిబిరంలో సుమారు 65 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో మోతిబిందు (శుక్లాలు) ఉన్నట్లు గుర్తించిన 14 మందిని శస్త్రచికిత్సల నిమిత్తం బోధన్‌ లయన్స్ క్లబ్‌ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో లింగాపూర్‌ సర్పంచ్‌ దెగం హనుమంతు, గన్నారం సర్పంచ్‌ శారద రాజప్ప పటేల్‌, కంటి వైద్య సహాయకులు, లయన్స్ క్లబ్‌ ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Views: 9
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు